సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది..వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా అయిపోయిన వెంటనే బన్నీ ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని.. అక్టోబర్ లో పుష్ప అయిపోయిన వెంటనే బన్నీ ఐకాన్ సినిమా షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ చేయనున్నాడని అన్నారు.
మరోవైపు ఐకాన్ తో పాటు బన్నీ బోయపాటితో కూడా మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బన్నీ ఈసినిమాకు కూడా డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధం నుండి బన్నీ బోయపాటి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. ఐకాన్ తో పాటు బోయపాటి సినిమాను కూడా పార్లల్ గా చేయనున్నాడట. మరి చూద్దాం అసలు పుష్ప తరువాత బన్నీ ఏ సినిమాను మొదలుపెడతాడో..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























