డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ కథలను చేయడానికి యంగ్ హీరో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. ఈసినిమా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగేలా చేశాడు శ్రీవిష్ణు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు శ్రీ విష్ణు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి అంటూ చిత్రయూనిట్ కు సంబంధించిన ఫొటో షేర్ చేస్తూ సినిమా పూర్తయిందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి ..
It’s a wrap for #𝐀𝐫𝐣𝐮𝐧𝐚𝐏𝐡𝐚𝐥𝐠𝐮𝐧𝐚 shoot! 🎬@Actor_Amritha @DirTejaMarni @Actor_Rajkumar9 @MaheshAchantaa #ChaitanyaGarikipati @priyadarshan_09 #NiranjanReddy #AnveshReddy @pasha_always @MatineeEnt pic.twitter.com/odVranOKfu— Sree Vishnu (@sreevishnuoffl) September 13, 2021
కాగా ఈసినిమాలో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఈసినిమాతో పాటు ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























