కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్న సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఈ నెలలోనే ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఆగష్ట్ 27న కూడా పలు సినిమాలు పోటీకి సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు సెప్టెంబర్ మొదటి వారం కూడా ఫుల్ గా బుక్ అయిపోయింది. ఇప్పటికే పలు సినిమాలు సెప్టెంబర్ 3వ తేదీని బుక్ చేసుకోగా ఇప్పుడు మరో సినిమా కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు ఎప్పటినుండో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీటీమార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంపత్ నంది- గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. ఇక ఈసినిమా షూటింగ్ ఎపుడో పూర్తి చేసుకుంది. అంతా బాగుంటే ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల అయ్యేది. కానీ తెలిసిందే కదా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడం.. థియేటర్స్ ఓపెన్ చేయడంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Mark the date and lock it!
We are Loading on Sept 3rd, Only in theatres. @YoursGopichand @IamSampathNandi@tamannaahspeaks @srinivasaaoffl @bhumikachawlat @SS_Screens @DiganganaS #Manisharma @adityamusic#SeetimaarrOnSept3 pic.twitter.com/PpZ59iaxCv
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 24, 2021
కాగా ఈ సినిమాలో తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా మరో కీలక పాత్రలో నటిస్తుంది. మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కూడా నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: