“నన్నుదోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నభా నటేష్ “ఇస్మార్ట్ శంకర్ “, “సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్”మాస్ట్రో ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నభా నటేష్ ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకట్టుకునే అందచందాలతో పాటు చలాకీ నటనతో అభిమానుల్ని సొంతం చేసుకున్న నభా నటేష్ కేవలం గ్లామర్ రోల్స్‌లోనే కాకుండా అభినయప్రధాన పాత్రల్లో మెప్పించాలనే లక్ష్యంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాననీ, పెద్ద లక్ష్యాల్ని పెట్టుకొని పరిశ్రమలోకి రాలేదనీ , మంచి నటిగా తనను ప్రేక్షకులు గుర్తుంచుకుంటే చాలనీ , జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలన్నదే తన సిద్ధాంతమనీ , ఇండస్ట్రీలోని పోటీతత్వం గురించి అస్సలు ఆలోచించననీ , తన ప్రతిభపై పూర్తి నమ్మకం ఉందనీ , ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉందని దర్శకులు విశ్వసిస్తున్నారనీ , భవిష్యత్తులో ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నా ననీ నభా నటేష్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: