కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ “ఆచార్య ” మూవీ లో తామిద్దరూ నటించిన సీన్స్ తో అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మరువలేను అంటూ వీడియో రిలీజ్ చేసి చిరంజీవి కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన “ఆచార్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































