మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూాడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. నిజానికి ఏప్రిల్ లోనే ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈ క్రమంలో గోపీచంద్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The game is ON: #Seetimaarr will hit big screens this September. Countdown has started and watch this space to know the release date.@YoursGopichand @IamSampathNandi@tamannaahspeaks @srinivasaaoffl @SS_Screens @DiganganaS @bhumikachawlat #Manisharma @adityamusic pic.twitter.com/Lk8DGeJaqJ
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 20, 2021
కాగా ఈ సినిమాలో తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా మరో కీలక పాత్రలో నటిస్తుంది. మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కూడా నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: