మొత్తానికి వైష్ణవ్ తేజ్ రెండో సినిమా నుండి అప్ డేట్ వచ్చేసింది. మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన వైష్ణవ్ తేజ్ వెంటనే రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు. క్రిష్ లాంటి పెద్ద డైరెక్టర్ తోనే అవకాశం దక్కించుకున్నాడు. ఈసారి కూడా వైష్ణవ్ తేజ్ డిఫరెంట్ స్టోరీతోనే వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈసినిమాను క్రిష్ తెరకెక్కించిన నేపథ్యంలో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. అక్టోబర్ 8న ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది అంటూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘#KondaPolam‘ it is!
The title & Firstlook of #PanjaVaisshnavTej, @Rakulpreet & brilliant @DirKrish‘s Adventurous love story
▶️ https://t.co/JtBEfpIMG8#KondaPolamOnOct8th@mmkeeravaani #Sannapureddi @gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_Ent @MangoMusicLabel pic.twitter.com/NBwmAXiei5
— Telugu FilmNagar (@telugufilmnagar) August 20, 2021
ఇక అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పల్లెటూరి అమ్మాయిలా.. డీగ్లామర్ రోల్ లో రకుల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: