అల్లు వారసత్వంతో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా టాప్ లో ఉన్నారు , ఆ తర్వాత తనయులు బన్నీ, శిరీష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు అదే వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ. అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొంది అల్లు అర్హ. ఇక ఇదిలా ఉండగా నేడు అల్లు అర్హ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్హ కు ఎలాగైతే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారో.. అంతే గ్రాండ్ గా చిత్రయూనిట్ అర్హకు వీడ్కోలు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహ కూడా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా సమంత అక్కినేని ప్రధాన పాత్రలో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమాలో అల్లు అర్హ భరత అనే ప్రిన్స్ పాత్రలో నటిస్తుంది. సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎలాగూ సినిమా చాలా వరకూ సెట్స్ లో నే కాబట్టి జరిగేది వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో గుణశేఖర్ ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఈ ఏడాది రిలీజ్ కు నోచుకుంటుందో లేదో…!



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























