కన్నడ బ్యూటీ రష్మిక మందన్న దూకుడు ప్రస్తుతం మాములుగా లేదు. కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమైన రష్మిక తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ హీరోలతో సైతం అవకాశాలు కొల్లగొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళిపోయింది. కేవలం తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లోనూ రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టేసింది. ఇక షూటింగ్ లు కూడా పార్లర్ గా అటు ఇటు చేసుకుంటూ వెళుతుంది. మొత్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకెళ్లిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన వల్ల తన పేరెంట్స్ అప్ సెట్ అవుతున్నారని తెలుపుతుంది. దీనికి కారణం ఏంటంటే కరోనా. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గక పోవడంతో నేను వరుసగా షూటింగ్స్ లో పాల్గొనడంతో మా పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉందని.. దాంతో కొద్ది రోజులు షూటింగ్స్ ను పోస్ట్ పోన్ చేసుకోమని అడుగుతున్నారు.. కానీ షూటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది నాచేతిలో ఏం ఉండదు కదా.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ లో పాల్గొంటున్నా అని చెబుతుంది ఈ కన్నడ బ్యూటీ..
ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో ఇంకా శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో అలాగే అమితాబ్ తో కూడా మరో సినిమా చేస్తుంది. వీటితో పాటు తమిళ్ లో మరో సినిమా చేస్తుంది ఈ భామ.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























