బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి రెండు సంవత్సరాలుగా కోలీవుడ్ కు దూరంగా ఉంటున్నారు. “NGK ” మూవీ తరువాత సాయి పల్లవి కోలీవుడ్ మూవీస్ లో నటించలేదు. ఇప్పుడు సాయి పల్లవి తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ బ్యానర్ పై గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























