తమిళ హీరో అయినా కూడా తన సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూర్య. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. అందులో ఇటీవలే ప్రకటించిన జై భీమ్ కూడా ఒకటి. రీసెంట్ గానే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో లాయర్ పాత్రలో చేస్తున్నాడు సూర్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా 1993లో సీనియర్ అడ్వకేట్ చంద్రూ ట్రైబల్స్ కోసం ఎలా న్యాయ పోరాటం చేశారు..వారికి ఎలా న్యాయం చేశారు మొదలైన సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజిషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో సూర్య చేస్తున్న నాలుగో చిత్రం ఇది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























