“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో నిధి తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ , దర్శకురాలు ఫరా ఖాన్ , సోనూసూద్ తో ఒక మ్యూజిక్ వీడియో ను తెరకెక్కించనున్నారు. ఆ మ్యూజిక్ వీడియో లో నిధి అగర్వాల్ ఎంపిక అయ్యారు. ఆ అవకాశం రావడంతో నిధి థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంగా నిధి మాట్లాడుతూ .. ఫరాఖాన్ కొరియోగ్రఫీ లో నటించడానికి ప్రతీ ఒక్కరూ , ఎదురుచూస్తారనీ , కొరియోగ్రఫీ తో పాటు ఫరాఖాన్ దర్శకత్వంలో అవకాశం రావడం ఆనందంగా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: