నేచురుల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. . రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్,
పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
” టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ” టక్ జగదీష్ ” మూవీ కి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెద్ద ఎత్తున ఆఫర్స్ ఇచ్చినా నిర్మాతలు మాత్రం ఆ మొత్తంను తిరష్కరించడంతో పాటు తాము కేవలం థియేటర్ రిలీజ్ కు మాత్రమే వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే “టక్ జగదీష్ ” మూవీని మేకర్స్ విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. తాజాగా మీడియాలో వస్తున్న వార్తలను” టక్ జగదీష్” నిర్మాతలు కొట్టి పారేశారు. తాము సినిమాను థియేటర్స్ లో మాత్రమే విడుదల చేస్తామంటూ ప్రకటించారు.“నిన్నుకోరి” వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























