శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. కాస్త లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమాలో మొదటి నుండి హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్స్ రవితేజ సరసన నటించనున్నారు. దివ్యాంశ కౌశిక్, తో పాటు పలు తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్లు కూడా ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #RamaRaoOnDuty welcomes its lovely leading ladies @itsdivyanshak & @rajisha_vijayan on board.@RaviTeja_offl @directorsarat @sathyaDP @sahisuresh @Cinemainmygenes @SamCSmusic @RTTeamWorks #RamaRao pic.twitter.com/1oTjf5MO6J
— SLV Cinemas (@SLVCinemasOffl) July 19, 2021
కాగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ చేయడానికిి ప్లాన్ చేస్తున్నారు.
దీనితోపాటు రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























