నాగశౌర్య ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి లక్ష్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లాస్ట్ షైడ్యూల్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటితో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు అనీష్ కృష్ణ సినిమాను కూడా రీస్టార్ట్ చేసాడు నాగశౌర్య. హైదరాబాద్ లో సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను నేడు ప్రారంభించారు. ఇక ఈవిషయాన్ని నాగశౌర్య తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సెట్ లో ఉన్న ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. అందులో నాగశౌర్య, ఆయన తల్లి ఉషా ముల్పూరి, హీరోయిన్, దర్శకుడు ఉన్నారు.
Laughter ride begins all over again😉
#NS22@ira_creations @ShirleySetia #Anishkrishna @realradikaa #Saisriram @mahathi_sagar @vennelakishore @amitashpradhan @actorbrahmaji @eyrahul @UrsVamsiShekar pic.twitter.com/cm2lja7hKa— Naga Shaurya (@IamNagashaurya) July 13, 2021
కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో షిర్లే సెతియా హీరోయిన్ గా నటిస్తుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటి రాధిక ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























