కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగిగా పేరు తెచ్చుకొని అన్ని విషయాల్లోనూ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా ఇప్పుడే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నిజానికి గౌతమ్-సితారలలో సితార చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే యూట్యూబ్ ను కూడా మెయిన్ టైయిన్ చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు గౌతమ్ కూడా ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన సాధించిన ఓ ఘనతే దానికి నిరద్శనం. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈవిజయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తుంది నమ్రత. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో ఉండటం సంతోషంగా ఉందని.. గౌతమ్ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని.. అంతేకాకుండా గౌతమ్ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ తండ్రికి తగ్గ తనయుడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























