స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “ఖైదీ “తమిళ మూవీ హిందీ లో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్ హీరోగానటిస్తుండగా, ఆయనకు జోడీగా కాజల్‌ను ఎంపికచేసినట్లు సమాచారం. “ఖైదీ “మూవీ లో హీరోయిన్ పాత్ర లేదు. బాలీవుడ్ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేశారనీ , హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ లో అజయ్‌దేవ్‌గణ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనుందనీ సమాచారం. బ్లాక్ బస్టర్ “సింగం “హిందీ మూవీ లో అజయ్ దేవగన్ కు జోడీగా నటించిన కాజల్ 10 సంవత్సరాల తరువాత మరోసారి జోడీగా నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: