ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ పతాకాలపై కౌశిక్ కుమార్ కత్తూరి, రామసాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పచ్చీస్’. ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకృష్ణ, రామసాయి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. శ్వేతా వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గానే జూదం అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ అందించాడు. ఇక ఈసినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. జూన్ 12న అమెజాన్ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.
So happy to launch #PachchisTrailer🃏- A Unique Crime Thriller🔥. Best wishes to the entire team !
▶️ https://t.co/a4tcA92Gq6#PachchisOnPrime from June12th@raamzofficial @AvasaChitram @raastafilms @krishchad @csaikumarr @dineshyadavb @SwetaaVarma @smaransai @MangoMusicLabel pic.twitter.com/EFWBT0a3qv
— Rana Daggubati (@RanaDaggubati) June 9, 2021
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జయ చంద్ర, రవి వర్మ, శుభలేఖ సుధాకర్, దయానంద్ రెడ్డి, కేశవ్ దీపక్ తదితరులు నటించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























