ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు.. హోస్ట్ గా కూడా మారింది. సేవా కార్యక్రమాలు ఎలాగూ చేస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2 తో వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఈసిరీస్ లో సమంత నటనకు గాను మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా సమంత మంచిగా యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా క్వీన్ గా కూడా సమంతకు పేరుంది. కేవలం సినిమాలకు సంబంధించే కాదు చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతుంది సమంత. ఇక తాజాాగా సోషల్ మీడియాలో మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. తాజాగా తన ఇన్సాలో ఫాలోవర్ల సంఖ్య 17 మిలియన్స్ కు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తున్నారు. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: