వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. దేశ రక్షణ కై ఎంతటి సాహసానికైనా సిద్ధపడే గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈమూవీ కై అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఒక సెట్ రూపొందుతుంది.జూలై సెకెండ్ వీక్ నుండి ఈ సినిమా ను సెట్స్ మీదకు తీసుకువెళ్ళాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తో పాటు హీరో నాగార్జున బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున , కాజల్ అగర్వాల్
ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























