యంగ్ హీరో నిఖిల్ కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉన్నాడు. అందులో కార్తికేయ2 సినిమా కూడా ఒకటి. నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కార్తికేయ 2ను తెరపైకి తెచ్చారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి.. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సిన పని కానీ.. కరోనా వల్ల ఏదీ అవ్వలేదు. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలోనే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొంత వరకూ షూటింగ్ జరుపుకుంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇక పోస్టర్ లో నిఖిల్ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుండగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో ‘రక్షకులు సంక్షోభంలో ఉద్భవిస్తారు’ అని పేర్కొన్నారు.
Saviours Emerge in Crisis!
Team Karthikeya-II wishes many more Happy birthdays to our Hero @actor_Nikhil@chandoomondeti @kaalabhairava7 @AbhishekOfficl @vivekkuchibotla @sahisuresh @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial @nikhilkoduru #Karthikeya2 #HappyBirthdayNikhil pic.twitter.com/UbqIb1q85U
— People Media Factory (@peoplemediafcy) June 1, 2021
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: