దత్తత గ్రామానికి మహేష్ వ్యాక్సిన్‌ పంపిణీ

Super Star Mahesh Babu Organizes Special Vaccination Drive To Burri Palem Villagers,Telugu Filmnagar,Covid Vaccination,Mahesh Babu Burripalem Vaccination,Vaccination In Burripalem,Mahesh Babu About Vaccination,COVID-19,CoronaVirus,COVID-19 Vaccination,COVID-19 Vaccine,COVID Vaccine,Mahesh Babu,Tollywood,Corona Updates,Covid19,Covid Vaccine,Get Vaccinated,Vaccination,Corona Vaccine,Mahesh Babu's Burripalem Village,Actor Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Organizes Vaccination Drive To Burri Palem Villagers,Burri Palem Villagers,Burri Palem,Special Vaccination Drive In Burri Palem,Vaccination Drive For Burri Palem Villagers,Mahesh Babu Starts Vaccination Drive In Burripalem,Mahesh Babu Sponsors A Covid-19 Vaccination Drive In Burripalem,Mahesh Babu Arranges Vaccine Drive,Mahesh Babu Arranges Vaccination Drive At Burripalem,Super Star Mahesh Babu Sponsors Vaccination Drive,Mahesh Babu Sponsors Covid-19 Vaccination Drive In Burripalem,Mahesh Babu Vaccine Drive,Mahesh Babu Covid-19 Vaccine Drive

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. అంతేకాదు శ్రీమంతుడు సినిమా స్పూర్తితో ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెంలో వ్యాక్సీన్ పంపిణీ చేశారు. ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా మళ్లీ సాధారణంగా జీవించడానికి వ్యాక్సీన్ అనేది ఒక హోప్ లాంటిది.. బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్‌ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్‌ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనల తెలిపారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరో నెలలో కరోనా ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.