ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా తనదైన శైలిలో నవ్వించిన శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ముగ్గురు మొనగాళ్లు. శ్రీనివాస్ రెడ్డితో పాటు కన్నడ మూవీ దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి అలానే.. వెన్నెల రామారావు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌పోస్టర్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈ సినిమా ట్రైలర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. 2.15నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ఆధ్యంతం నవ్వులు పూయించింది. శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ట్రైలర్‌లో వీరు ముగ్గురు కలిసి చేసే అల్లరి కడుపు చక్కలయ్యేలా నవ్వించింది. ఇక అనుకోకుండా వరుస హత్యలకేసులో వీరు ముగ్గురు ఇరుక్కోవడం తర్వాత ఆ కేసుని వీళ్లు ఛేదించాలని నిర్ణయించుకోవడం లాంటి అంశాలు థ్రిల్లింగ్‌గా ఉండడంతో పాటు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాయి. శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి కామెడీ చేశారు. మొత్తానికి ఈ ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























