ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు మన హీరోలు. వారిలో మంచు వారసుడు హీరో మంచు విష్ణు కూడా ఒకడు. విష్ణు కూడా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. ఇటీవలే మోసగాళ్లు లాంటి సినిమాను తన ప్రొడక్షన్ నుండే నిర్మించి రిలీజ్ చేశాడు. ఇక ఇదిలా ఉండగా చదరంగం వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా మంచు విష్ణు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రాజ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకుంది. ఆన్-డిమాండ్ వీడియో, ఆడియో నుంచి ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌లో ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డును గెలుపొందింది. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. “ఈ గుర్తింపు లభించినందుకు ధన్యవాదాలు! శ్రీకాంత్, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్, కాస్ట్ అండ్ క్రూ ఈ అవార్డుకు అర్హులు.. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశంలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఎంపిక కావడం మాకు గర్వకారణం” అంటూ తన సంతోషాన్ని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Thank you for the recognition!. #Srikanth garu, director Raj, executive producer my buddy Vijay, the entire cast &crew deserve this & 🙏 @Zee5 for trusting me. To be the best Regional web series across India, in all platforms, is a proud moment to us 🤘🏽💪🏽🙏 #Chadarangam pic.twitter.com/ea5vXNbFsh
— Vishnu Manchu (@iVishnuManchu) May 14, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: