కరోనా మహమ్మారి కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయి సినీ కార్మికులు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఆ సమయం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించి , సినీ ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి, నిత్యావసర వస్తువులు సినీ కార్మికులకు అందజేసి వారిని ఆదుకున్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
“కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులు , జర్నలిస్ట్ లకు ఉచితంగా కోవిడ్-19 టీకా ఇప్పించనున్నామని చిరంజీవి మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామనీ, ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలంటూ ఒక వీడియో సందేశాన్ని చిరంజీవి షేర్ చేశారు.చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో చిరంజీవి బిజీగా ఉన్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























