‘లైగర్’ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Hollywood Action Director Roped In For Liger Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hollywood Action Director Roped In For Liger,Hollywood Action Director In Liger Movie,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Film,Liger Movie Telugu,Liger Update,Liger Movie Update,Liger Film Update,Liger Movie Latest Updates,Liger Movie News,Liger Movie Latest News,Puri Jagannadh,Director Puri Jagannadh,Puri Jagannadh Liger,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Liger,Liger Vijay Deverakonda,Ananya Panday,Actress Ananya Panday,Karan Johar,Charmme Kaur,Hollywood Stunt Choreographer Andy Long,Hollywood Stunt Choreographer Andy Long Joins Liger Team,Andy Long,Andy Long Roped In For Liger Film,Hollywood Stunt Master Andy Long Roped In For Liger,#LIGER

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ చేస్తున్న సినిమా లైగ‌ర్‌. వీరిద్దరి సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. అలాంటిది వీరిద్దరి కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఈసినిమాపై కూడా అదే క్రేజ్ ఉంది. హీరోలను ఓరేంజ్ లో ఎలివేట్ చేసే పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక ప్రస్తుతం ఈసినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తుండగా ఇప్పటికే థాయ్ లాండ్ నిపుణుల ద్వారా పూరీ విజయ్ కు శిక్షణ ఇప్పించాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నే రంగంలోకి దించాడు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ కూడా ఈసినిమాకు పనిచేస్తున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. ఇంటెన్స్ యాక్ష‌న్స్ సీక్వెన్సెన్‌ను ఆండీ లాంగ్ ప‌ర్య‌వేక్షించినట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. జాకీ చాన్ మ‌రియు అనేక ఇతర హాలీవుడ్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి పనిచేశాడు ఆండీ లాంగ్.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.