నటి కావాలనే అభిలాష ఉన్న నిధి అగర్వాల్ “మున్నా మైకేల్ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు నిధి కథానాయికగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ తో నిధి గుర్తింపుపొందారు. “భూమి “, “ఈశ్వరన్ ” మూవీస్ తో నిధి తమిళ ప్రేక్షకులను అలరించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కథానాయికగా నటిస్తున్న నిధి ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. “హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న నిధి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. నిధి మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ మూవీస్ చూస్తూ పెరిగిన తాను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ , సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను చూసి చాలా నేర్చుకున్నాననీ , పవన్ కళ్యాణ్ కు అభిమాని నైన తాను పవన్ కళ్యాణ్ తో నటించడం తో తన కలనెరవేరిందని చెప్పారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























