థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబడుతుంది. “జాతిరత్నాలు ” మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించడం తో ఫరియా పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. లక్కీ గర్ల్ ఫరియా కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తి కర స్క్రిప్ట్ అయితే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమేనని చెప్పిన ఫరియా మరో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … సైకో క్యారెక్టర్ తన డ్రీమ్ రోల్ అనీ , తన టాలెంట్ ను నిరూపించే పాత్రలలో నటించాలని ఉందనీ చెప్పారు. ఫరియా కోరిక నెరవేరాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: