మార్చి నెల మొత్తం థియేటర్ల దగ్గర సినిమాల సందడితో సరిపోయింది. వారానికి కనీసం నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోగా.. కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. ఇక మార్చి నెల ముగిసిపోతుంది. ఏప్రిల్ వచ్చేస్తుంది. సాధారణంగా ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ల సందడి ఉంటుంది. కాకపోతే గతఏడాది కరోనా ఎఫెక్ట్ వల్ల ఈఏడాది మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. మరి ఈ శుక్రవారం ఏప్రిల్ 2 న కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఒకటి నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఒకటి మరొకటి కార్తి హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా ఒకటి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైల్డ్ డాగ్
అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఆమధ్య ఓటీటీలో రిలీజ్అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా ఏప్రిల్ 2వ తేదీన ఈసినిమా థియేటర్ లలోనే రిలీజ్ కానుంది. కాగా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న సయామీ ఖేర్, అలీ రెజా, మయాంక్ ప్రకాశ్ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
సుల్తాన్ కార్తి
తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కార్తి. ఇక ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తి.. ఇప్పుడు మరో కమర్షియల్ సినిమాతో వచ్చేస్తున్నాడు. రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న ఈసినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఇందులో నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు సంగీతం వివేక్ మెర్విన్ అందిస్తుండగా.. ఎడిటింగ్: అంతొనీ, సినిమాటోగ్రాఫర్ గా సత్యన్ సూర్యన్ పని చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























