గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెపుతున్నాడు నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. మేజర్ సినిమా టీజర్ ను శేష్ నాకు చూపించాడు… కానీ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే ఏం చెప్పలేకపోతున్నాను.. కానీ ఒక విషయం చెప్పగలను అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. అంతేకాదు నేను ఏంచెప్పలేదు శేష్ అంటూ చమత్కరించాడు.
So, Seshoo just showed me the first teaser of #Major. And he’s made me promise that I’ll shut🙊🙊 But damnnnnn… all I will say is… 😃😃🤩🤩🤯🤯😮😮🤪🤪😍😍😍🤯🤯🤯🤩🤩. That’s it! Can’t wait for him to release it and you all to see it! @AdiviSesh I didn’t say anything 🙊🙊
— Rahul Ravindran (@23_rahulr) March 3, 2021
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల `దబాంగ్ 3`బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























