రన్ రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే మెగాస్టార్ లూసిఫర్ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల అది వేరే డైరెక్టర్ చేతికి వెళ్ళింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దాదాపు రెండేళ్ల తర్వాత మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. సుజీత్ యాక్షన్ థ్రిల్లర్ ను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుజీత్ తన తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. నా కొత్త ప్రాజెక్ట్ జీ స్టూడియోస్ తో కలిసి చేస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాను.. సాహూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ.. ఈసారి యాక్షన్ తో పాటు ఎమోషనల్ యాంగిల్ ను కూడా చూపించబోతున్నా అని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలిపాడు.
ఇక జీ స్టూడియోస్ సీఈవో షారిక్ పటేల్ మాట్లాడుతూ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తో అసోసియేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈసారి మంచి యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా కథను సిద్ధం చేసాడని.. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై తీసుకురావడానికి చాలా ఆతృతగా ఉన్నాం.. తనకున్న టెక్నీకల్ నాలెడ్జి తప్పకుండా ఈ సినిమాకు ఒక రేంజ్ లో ఉంచుతుంది అని తెలిపారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























