ఆర్కే నాయుడు.. కాస్త సీరియల్స్ చూసే అలవాటు ఉన్నవారికి వెంటనే ‘మొగలిరేకులు’ సీరియల్ గుర్తుకొస్తుంది. ఈ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ నటించిన సంగతి తెలిసిందే. సాగర్ కంటే ఆర్కే నాయుడుపేరే ఫిక్స్ అయిపోయింది తనకి. ఆ సీరియల్ సాగర్ కు తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక హీరోకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో దాదాపు ఈ పాత్ర ద్వారా సాగర్ కు కూడా అలాంటి క్రేజే దక్కింది. ఇక ఆ గుర్తింపుతో అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటించాడు.. అంతేకాదు ‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది అనుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాతో వస్తున్నాడు. పద్మశ్రీ దర్శకత్వంలో ప్రస్తుతం ‘షాదీ ముబారక్’ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Bringing you a beautiful wedding tale♥#ShaadiMubarak Releasing worldwide on March 5th.
Starring @urRKsagar & @Drishyaraghunat
Directed by #Padmasri
Audio on @MangoMusicLabel #DilRaju #Shirish #SunilKashyap @SVC_Official pic.twitter.com/ZTXWTJiGt0— Telugu FilmNagar (@telugufilmnagar) February 11, 2021
కాగా దృశ్యా రఘునాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























