ఫిబ్రవరి 14 న ఎలాంటి సాంగ్ లేదు – థమన్ క్లారిటీ

Thaman Gives Clarity About Vakeel Saab Song Release On Valentines Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Thaman,Thaman SS,Music Director Thaman,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Movie Telugu,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Songs,Vakeel Saab Song,Vakeel Saab Movie Songs,Vakeel Saab Telugu Movie Songs,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Thaman About Vakeel Saab Song,Thaman About Vakeel Saab Song Release,Thaman Clarity About Vakeel Saab Song,Pawan Kalyan Vakeel Saab New Song,Thaman About Special Song Rumors Of Vakeel Saab

అందరూ ఏమో కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం వకీల్ సాబ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ క్రేజ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.. దానికితోడు అజ్ఞాతవాసి తర్వాత చాలా సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత చేస్తున్న సినిమా.. మరి దాదాపు మూడేళ్లు తన అభిమాన హీరోను వెండితెరపై చూసే ఛాన్స్ రాలేదు.. మరి ఇంకెలా ఉంటుంది. అందుకే ‘వకీల్ సాబ్’ కోసం అంతలా చూస్తున్నారు. ఈ ఎడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో వకీల్ సాబ్ కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మగువా మగువా పాటకు ఏ రేంజ్ లో క్రేజ్ అందిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు తాజాగా మరో సాంగ్ కూడా రాబోతున్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం థమన్ చేసిన ట్వీటే కారణం. ‘ఫిబ్రవరి 14న లవ్’ అని ట్వీట్ చేయడంతో ఈ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈవార్తలకు ఒక క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 14 న ఎలాంటి సాంగ్ రావట్లేదని.. ఇంకా మ్యూజిక్ కాంపోజిషన్స్ లోనే ఉన్నామని.. బెస్ట్ సాంగ్స్ అందించడానికి చాలా కష్టపడుతున్నామని తెలిపాడు. మరి ఎలాంటి సాంగ్ రాట్లేదని అర్థమైపోయింది.. మరి ఇంకేదైనా అప్ డేట్ ఉంటుందేమో చూద్దాం..

వేణు శ్రీరామ్ దర్శకత్వం అందిస్తున్నఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.