సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు పుష్ప టీం ఈరోజే ప్రకటించింది. మారేడు మిల్లి, రంపచోడవరంలలో ఇప్పటివరకూ షూటింగ్ జరుపుకుంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్ కు ప్రమాదం జరిగింది. ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో వెనుక భాగం దెబ్బతింది. అయితే కార్వాన్ లో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ఇదిలా ఉండగా ‘రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ‘పుష్ప’సినిమాకు సంబంధించి నవంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌కు సహకరించిన ఆదివాసీలు, అధికారులకు ధన్యవాదాలు. వారి సహకారం లేకుండా చిత్రీకరణ సజావుగా సాగేది కాదని నేడు అధికారికంగా తెలిపారు.
కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























