గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నలుగురు వ్యక్తులు కలిసి రోడ్ ట్రిప్ ను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథ. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ‘ఇదే మా కథ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటరల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ మంచు ప్రదేశంలో బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తున్నారు.
కాగా గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్రసాద్, జోష్ రవి, తివిక్రమ్ సాయి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుమణి, సంధ్య జనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతోపాటు ఇండియాలోనే ఇలాంటి జోనర్ లో వస్తున్న తొలి సినిమా ఇదే అంటున్నారు దర్శక నిర్మాతలు. చూద్దాం మరి రైడర్స్ గా వస్తున్న ఈ సినిమా వారికి ఎంత బ్రేక్ ఇస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: