‘రంగస్థలం’లో రంగమ్మత్త క్షణం’లో ఏసీపీ జయ భరద్వాజ్ గా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఒకవైపు బుల్లితెరపై టాప్ యాంకర్ గా యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం తను ప్రధాన పాత్రలో ‘ థ్యాంక్ యూ బ్రదర్’ అనే సినిమాలో వస్తుంది. ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా మరో మంచి పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో అనసూయ నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాలో అనసూయ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనసూయ పాత్ర చాలా కీలకం అని.. అందుకే అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం అనసూయకు ఈ పాత్ర ఎంత వరకూ కలిసొస్తుందో.

కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























