సంక్రాంతి అయిపోయింది.. పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసి వెళ్లిపోయాయి. ఇక ఫిబ్రవరికి చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరిపోయింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గళ్ల లుంగీ, కాటన్ షర్ట్, భుజాన కండువాతో నవ్వుతూ నిల్చొని వున్న శర్వానంద్ కనిపిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే స్టోరీ ఇదని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, స్టిల్స్ ను బట్టి అర్ధమవుతుంది.
మహాశివరాత్రి శుభాకాంక్షలతో MARCH 11th రోజు రిలీజ్ కి #Sreekaram 😊#SreekaramOnMarch11th @ImSharwanand @priyankaamohan @Im_bkishor @saimadhav_burra @MickeyJMeyer @RaamAchanta #GopiAchanta @SonyMusicSouth #Sreekaram in Cinemas from MARCH 11th ❤️ pic.twitter.com/5GNUUXWaNZ
— 14 Reels Plus (@14ReelsPlus) January 23, 2021
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో కూడా తెలుగు, తమిళ్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై 2019లో ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























