వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. నలభై సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ అందం , ఫిట్ నెస్ తో కుర్ర హీరోలకు పోటీగా ఉంటూ మహేష్ బాబు అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులలో మహిళా అభిమానులు కూడా అధిక శాతం లో ఉండడం విశేషం. కరోనా కారణంగా
లాక్ డౌన్ లో 10 నెలలపాటు ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో మహేష్ బాబు తన తాజా వర్కౌట్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తిసురేష్ జంటగా తెరకెక్కనున్న “సర్కారు వారి పాట “మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: