కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వడ్డికాసులవాడ లో రవి మోహన్.. లార్డ్ గోవిందగా సర్‌ప్రైజ్

ravi mohan to play lord govinda in vaddi kaasulavaada

వడ్డికాసులవాడ లో రవి మోహన్.. లార్డ్ గోవిందగా సర్‌ప్రైజ్

Ravi Mohan to Play Lord Govinda in Vaddi KaasulaVaada

ravi mohan to play lord govinda in vaddi kaasulavaada

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ అప్‌కమింగ్ మూవీ 'వడ్డికాసులవాడ' నుంచి మేకర్స్ ఒక గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రవి మోహన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వెంకటేశ్వర స్వామి చేయి ఒక సామాన్య మనిషి చేయిని పట్టుకున్నట్లుగా డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ముఖ్యమైన దైవ పాత్ర ద్వారా రవి మోహన్ తెలుగు తెరపై ఈ రీతిలో కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వినోదం మరియు బలమైన భావోద్వేగాల కలబోతగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ డిఫరెంట్ ఎంటర్‌టైనర్ తెలుగు ,తమిళ భాషల్లో ప్రేక్షకు ముందుకు రాబోతోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్