“బంగార్రాజు “మూవీ అప్ డేట్

Akkineni Nagarjuna To Be Seen In Soggade Sequel, Bangarraju Movie, Bangarraju Movie News, Bangarraju Movie Team, Bangarraju Movie Team Releases An Interesting Update, Bangarraju Movie Updates, King Nagarjuna Latest News, Latest Telugu Movies News, Soggade Chinni Nayana Movie Updates, Soggade Sequel, Soggade Sequel Is For Akkineni Nagarjuna, Telugu Film News 2017, Telugu Filmnagar, Tollywood Movie Updates

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. అనూప్ రూబెన్స్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సోగ్గాడే చిన్ని నాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్ ” మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన హీరో నాగార్జున “బంగార్రాజు” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందనున్న “బంగార్రాజు” మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి 16 వ తేదీ ప్రారంభం కానుంది. రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. “సోగ్గాడే చిన్ని నాయనా “మూవీలో బంగార్రాజు గా ప్రేక్షకులను అలరించిన హీరో నాగార్జున మరోసారి బంగార్రాజు గా ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.