2020 లో ఎంతో మంది సెలబ్రిటీస్ మరణించిన ఘటనలు చూశాం. ఇక ఇప్పుడు మరో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా మాతృవియోగం కలిగింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఏఆర్ రెహమాన్. రెహమాన్ తల్లి కరీమా బేగం కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. .చాలా కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నేడు కన్ను మూసారు. ఇక ఈ విషయాన్ని రెహమాన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. రెహమాన్ ట్విటర్‌లో తన తల్లి ఫొటో పోస్ట్ చేసారు. అంత్య క్రియలు కూడా నేడే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరీమా బేగం, ఆర్‌కే శేఖర్ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. వీరిలో ఏఆర్ రెహమాన్ చిన్నవాడు. రెహ్మాన్ తొమ్మిదేళ్ల వయసులో ఉండగా 1976లో ఆయన తండ్రి శేఖర్ చనిపోయారు. తాజాగా కరీమా కన్నుమూశారు.
ఇక రెహమాన్ కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్థున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆమె మృతికి సంతాపం తెలుపుతూ.. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ను మాకు అందించినందుకు థ్యాంక్స్.. సంగీతం ఉన్నంత కాలం మీరు బ్రతికే ఉంటారని ట్వీట్ లో పేర్కొన్నాడు.
A Great Mother KAREENA BEGUM JI 🙏🏻 who brought up a Great Son & LEGEND @arrahman SIR..
Sad to hear d news of her heavenly Abode🙏🏻
ThankU AMMA for giving us a Legend..🙏🏻
We know Ur Sacrifices n Love behind d Making of Him..U wil live On forever through his MUSIC❤️💐 https://t.co/FFpu1uUsv6
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 28, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: