సంక్రాంతి బరిలోకి ‘బంగారు బుల్లోడు’

Bangaru Bullodu, Bangaru Bullodu Movie, Bangaru Bullodu Movie Updates, Bangaru Bullodu Release, Bangaru Bullodu Release Date, Bangaru Bullodu Telugu Movie, Bangaru Bullodu Telugu Movie Latest News, Bangaru Bullodu Telugu Movie Teaser, latest telugu movies news, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ ఈరోజు ఒక అప్ డేట్ తో ముందుకొచ్చారు. బంగారు బుల్లోడు సినిమా జ‌న‌వ‌రి 2021లో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది. కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు చిత్రయూనిట్. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, ప్రభాస్‌ శ్రీను, జబర్దస్త్‌ మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’ అనే సస్పెన్స్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నాంది సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మరి కరోనా వల్ల ఇన్ని రోజులు థియేట‌ర్‌లోకి రాకుండా ఆగిపోయిన సినిమాలన్ని ఇప్పుడు క్యూ కడుతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీనే జరిగబోయేటట్టు కనిపిస్తుంది చూద్దాం మరి ఈ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.