బిగ్ బాస్ 4 – మొత్తానికి ఇన్ని రోజులు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీజన్ 4 ముగిసింది. దాదాపు 106 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను కలిగించింది. ఇక నిన్న గ్రాండ్ ఫినాలే జరుపుకున్న బిగ్ బాస్ లో ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున వచ్చిన వెంటనే పాత కంటెస్టెంట్స్.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ల పేరెంట్స్ తో ముచ్చటించారు. ఇక ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరి ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. హీరోయిన్లు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్ రావిపూడి గ్రాండ్ ఫినాలేలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక మొదట హౌస్ లోకి అనిల్ రావిపూడి-మెహ్రిన్ వెళ్లి కొంచం సేవు సందడి చేసి.. వారి పలు ప్రశ్నలు అడిగారు. ఇక చివర్లో ఉన్న ఐదుగురిని గార్డెన్ ఏరియాలోకి రమ్మని వారిలో నుండి మొదటగా హారికను ఎలిమినేట్ చేశారు. ఇక ఆ తర్వాత ప్రణీత కు 10లక్షలు ఇచ్చి పంపించి వారిని ఒప్పుకునేలా చేయమన్నారు. అయితే ఎవరూ వద్దనడంతో ఆ తర్వాత లక్ష్మీ రాయ్ ను పంపి మరో కంటెస్టెంట్ ను బయటకు తీసుకువచ్చారు. లక్ష్మీ రాయ్ అరియానాను హౌస్ నుండి బయటకు తీసుకొచ్చింది.
టాప్ 3లో అభిజిత్, అఖిల్, సోహైల్ లు ఉండగా.. ఎవరైన రూ. 25 లక్షలు తీసుకొని బయటకు రావచ్చు అనగానే సోహైల్ ఏ మాత్రం ఆలోచించకుండా రూ. 25 లక్షలు ఉన్న సూట్ కేసును తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.
ఫైనల్ గా ఇద్దరు అభి, అఖిల్ మిగలడంతో వారిని నాగార్జున స్వయంగా ఇంటినుండి తీసుకొచ్చాడు. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందించారు. అభిజత్ బిగ్‌బాస్–4విన్నర్ గా నిలవడంతో చిరు ట్రోఫీ అందించాడు. అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























