హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలుసు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది.తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే, ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం.. ఉత్తమ నటుడు(పవన్ కళ్యాణ్), ఉత్తమ సంగీత దర్శకుడు(దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ గాయకుడు(వడ్డేపల్లి శ్రీనివాస్ – “పిల్లా నువ్వు లేని జీవితం”) విభాగాల్లో ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డులను సొంతం చేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























