హీరో బాలకృష్ణ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఒక కొత్త దర్శకుడితో ఒక మూవీ కి , సక్సెస్ ఫుల్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న “బలరామయ్య బరిలో దిగితే ” మూవీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ కథానాయకుడిగా “పరమ వీర చక్ర “, “జై సింహా “, “రూలర్ ” వంటి మూవీస్ ను నిర్మించిన సి కళ్యాణ్ , తన బ్యానర్ సి కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బాలకృష్ణ హీరోగా మరొక మూవీ ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ గారు మా సంస్థను ఆ ఆయన స్వంత సంస్థ గా భావిస్తారనీ ,ఆయన తో సినిమా నిర్మించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందనీ , త్వరలోనే బాలకృష్ణ హీరోగా ఒక మూవీ రూపొందనుందనీ కళ్యాణ్ ప్రకటించారు. సి కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మరికొన్ని చిత్రాలను ప్లాన్ చేశాననీ , తన బ్యానర్ పై రానా దగ్గుబాటి , సత్యదేవ్ , రెజీనా లతో రూపొందించిన “1945 లవ్ స్టోరీ ” మూవీ ని త్వరలోనే విడుదల చేస్తామనీ కళ్యాణ్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: