బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ కథానాయిక గా నటించిన “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “అల్లుడు అదుర్స్ “మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం అయ్యింది. బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈమూవీ లో హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. 6వ తేదీ దుబాయ్ లో షూటింగ్ ప్రారంభం సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ హీరో నితిన్ తో సెల్ఫీ తీసుకున్నారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న నభా నటేష్ , ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం చాలా ఎగ్జయిటింగ్ గా ఉందంటూ ఆ సెల్ఫీ ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























