మీకు తెలుసా.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ గా ‘నంది అవార్డ్’ పొందిన రానా..?

Did You Know This Interesting Fact About Rana Daggubati?

కుటుంబం మొత్తం ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు చేస్తూనే ఉంది.. తాత దేశం గర్వించదగ్గ నిర్మాత.. తండ్రి టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్.. బాబాయ్ టాలీవుడ్ అగ్ర హీరో.. ఇంతమంది బలగం ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ హీరో. ఆ హీరో ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటది కదా. ఇంకెవరూ దగ్గుబాటి వారసుడు రానా. నిజానికి కుటుంబం మొత్తం సినీ పరిశ్రమకే పరిమితమవ్వగా..చిన్నప్పటినుండి అదే వాతారణంలో పెరిగినా రానా మాత్రం ముందు బిజినెస్ అంటూ దూరంగా ఉన్నాడు. అందుకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ కూడా లేట్ గా ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2010లో ‘లీడ‌ర్‌’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ముఖ్య‌మంత్రి అర్జున్ ప్ర‌సాద్‌ పాత్ర‌లో న‌టించి… మొద‌టి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన ఎ.వి.ఎం.ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విభిన్నమైన పాత్రలతో రానా అంటే డిఫరెంట్ గా సినిమాలు చేస్తాడు అన్న పేరును సంపాదించుకున్నాడు.

ఇక హీరోగా రాకముందే రానా నంది అవార్డు సొంతం చేసుకున్నాడని చాలా మందికి తెలియని విషయం. ఆశ్చర్యంగా ఉంది కదా కానీ నిజం.. మహేష్-త్రిష కాంబినేషన్ సైనికుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు రానా విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ గా పనిచేసాడు. ఇక సినిమాకు గాను రానా బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరి లో నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బొమ్మలాట సినిమాకు గాను నేషనల్ ఫిలిం అవార్డు ను సొంతం చేసుకున్నాడు రానా.

ఇక ప్రస్తుతం ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెరకెక్కిన “హాథీ మేరే సాథీ ” సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. వచ్చేఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే తెలిపాడు. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. దీనితోపాటు టాలెంటెడ్ హీరో రానా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో `విరాట ప‌ర్వం`లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత `హిర‌ణ్య క‌శ్య‌ప‌` చేయబోతున్న సంగతి విదితమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.