అవును మాకు కరోనా పాజిటివ్ వచ్చింది

Actor Rajasekhar Confirms That He Along With His Family Has Been Tested Positive For Corona Virus

కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. ఇక ఇప్పుడు మరో హీరో కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అది ఎవరిదో కాదో రాజశేఖర్ ఫ్యామిలీ. రాజశేఖర్‌, జీవిత కరోనా బారిన పడ్డారని.. గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని రాజశేఖర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ… ” మాపై వస్తున్న వార్తలు నిజమే.. నాకు, జీవితకు, పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది.. ప్రస్తుతం హాస్పిటల్‌లో చిక్సిత తీసుకుంటున్నాం. పిల్లలు శివానీ, శివాత్మికలకు కోవిడ్‌ పూర్తిగా తగ్గింది. నేను, జీవిత ఇంకా చికిత్స తీసకుంటున్నాం… ఇప్పుడు బాగానే కోలుకున్నాం..త్వరలోనే ఇంటికొచ్చేస్తాం” అన్నారు రాజశేఖర్‌.

 

ప్రస్తుతం రాజశేఖర్‌..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఓ హిట్ ఫిల్మ్‌కు రీమేక్‌గా రానున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. “యముడికి మొగుడు “మూవీ ఫేమ్ రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.