ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్టు ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. మహేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ.. ‘గొప్ప టాలెంట్ ఉన్న కీర్తి సురేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. సర్కారు వారి పాట టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా మీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండి పోయే గొప్ప సినిమాగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశాడు.
Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films💥💥💥 Have a great one !! 😊😊😊 pic.twitter.com/MPzEWc0uGE
— Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020
ఇక మహేష్ చేసిన ట్వీట్‌కు కీర్తి సురేష్ రీట్వీట్ కూడా చేసింది. ‘థాంక్యూ మహేష్ బాబు సర్. తొలిసారి మీతో కలిసి పనిచేయనున్నందుకు సంతోషంగా ఉంది.. దీని కోసం ఎదురు చూస్తున్నాను’ అని రిప్లై ఇచ్చింది.

‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























