ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే సెలబ్రిటీస్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎంత సత్తా ఉందో తెలుసు. ఏ విషయాన్నీ అయినా క్షణంలో వైరల్ చేసే సత్తా ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే ఉంది. అందుకే తమ సినీ ప్రచారాలకు ఉపయోగపడుతుందని సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఒకవేళ అకౌంట్స్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అనుష్కకూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క ఇన్స్టా లో ఉండగా… ఇటీవలే తను నటించిన నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్లో భాగంగా ట్విట్టర్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఇన్స్టాలో ఆమెను ఫాలో అయ్యేవారి 4 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా తన ఫాలోవర్స్ 4 మిలియన్లకు చేరిందని తెలుపుతూ.. అనుష్క ఓ పోస్ట్ చేసింది. ‘4 మిలియన్స్ .. అందరికీ ధన్యవాదాలు..’ అని తెలిపిన అనుష్క.. తన ఫొటోలతో నింపిన 4 మిలియన్ల పోస్టర్ను షేర్ చేసింది. ఈ పోస్టర్ మీద ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది.
ఇక ఇటీవలే నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను అలరించింది అనుష్క. ప్రస్తుతం మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































